News January 24, 2025
ఫీజులోనూ ఈ వ్యత్యాసం ఎందుకు?.. విద్యార్థి ఆవేదన
పోటీ పరీక్షల్లో రిజర్వేషన్లను దాటుకొని సీటు సాధిస్తే.. ఫీజులోనూ వ్యత్యాసం చూపడం ఏంటని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ MBBS ఫీజు GENకి రూ.14లక్షలు, OBCకి రూ.8లక్షలు, SC/STకి 0, EWS విద్యార్థులకు రూ.7లక్షలు అని ఉంది. తమ తల్లిదండ్రులూ అప్పులు చేసి చదివిస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. ఇక్కడైనా రిజర్వేషన్ తీసేయాలని సూచిస్తున్నారు.
Similar News
News January 24, 2025
జియో యూజర్లకు కొత్త ప్లాన్లు
యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకుండా వాయిస్, SMS ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.458 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, వెయ్యి SMSలు పంపుకోవచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, 3600 SMSలు పంపుకోవచ్చు. డేటా అవసరం లేని వారి కోసం ప్లాన్లు తీసుకురావాలని TRAI టెలికం సంస్థలను ఆదేశించింది.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. పిల్లలు ఏం చెప్పారంటే?
TG: మీర్‌పేట్‌కు చెందిన మాధవి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాధవి ఇద్దరు పిల్లల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. తమ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. మరోవైపు నిందితుడు చెప్పిన విషయాలపైనే కాకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News January 24, 2025
TG ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ‘ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దు. రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.