News October 20, 2024

మద్యం తాగేముందు ఆ రెండు చుక్కలు ఎందుకు?

image

మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తలగకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లోనే మద్యం తయారుచేసుకునేవారని, దీన్ని పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్‌ ఉందని అర్థమని చెప్పారు. రాజులపై విష ప్రయోగం జరిగిందో లేదో తెలుసుకోడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.

Similar News

News October 20, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు

image

TG: రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్‌లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతుల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు.

News October 20, 2024

పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు

image

AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.

News October 20, 2024

సర్ఫరాజ్‌పై అనిల్ కుంబ్లే ప్రశంసలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్‌లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.