News April 30, 2024

కేజ్రీవాల్‌ను ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేశారు?: సుప్రీం

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్నికల ముందు అరెస్ట్ చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారించింది. ‘పిటిషనర్ ఎత్తిచూపుతున్నట్లు ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు? కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు చూపండి’ అని ఆదేశించింది. దీనిపై మే 3న ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Similar News

News March 28, 2026

16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

image

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.

News March 28, 2026

EPFO యాప్‌తో రూ.5 లక్షల వరకు విత్‌డ్రా!

image

ఉద్యోగులు UMANG యాప్‌తో పాటు EPFO యాప్ ద్వారా కూడా PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.5లక్షల(75%) వరకు పెంచారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి సులభంగా పొందవచ్చు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, నామినీ అప్‌డేట్ వంటి సేవలు పొందవచ్చని, దీనివల్ల 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని EPFO వెల్లడించింది.

News March 28, 2026

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్

image

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.