News April 28, 2024
పొన్నవోలుకు ఏఏజీ పదవి ఎందుకిచ్చారు?: షర్మిల

AP: జగన్ ఆదేశాల మేరకే సీబీఐ ఛార్జిషీట్లో YSR పేరును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని APCC చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. జగన్ బయటపడాలంటే YSR పేరును ఛార్జిషీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశమన్నారు. జగన్ CMగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారని.. ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఆ పదవి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. FIRలో YS పేరుని CBI చేర్చలేదన్నారు.
Similar News
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.
News November 21, 2025
PHOTO: ఫిట్నెస్ ఫ్రీక్గా భారత మహిళా క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెట్లో ఫిట్నెస్ అనగానే మేల్ క్రికెటర్స్ గురించే మాట్లాడతారు. వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైరలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు U-19 T20 వరల్డ్ కప్-2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్రసాద్. ఆమె ఫిట్నెస్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
News November 21, 2025
నేషనల్ న్యూస్ రౌండప్

* జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
* బిహార్లో 27 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి హోంశాఖ కేటాయింపు
* శబరిమల గోల్డ్ చోరీ కేసు.. బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
* డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన TVK విజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ


