News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.
Similar News
News October 3, 2025
కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.
News October 3, 2025
భార్య రహస్య వీడియోలు ఫ్రెండ్స్‌కు పంపిన ప్రబుద్ధుడు

కట్టుకున్న భార్యతో పడక గదిలో గడిపిన సన్నివేశాలను రహస్యంగా వీడియోలు తీసి తన సహచరులకు పంపించాడో ప్రబుద్ధుడు. కర్ణాటక పుట్టెనహళ్లి ఈ ఘటన జరిగింది. అంతేకాక వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త సయ్యద్ ఇనాముల్ హక్, మామ వేధిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిరాకరించడంతో వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని పేర్కొంది. అప్పటికే పెళ్లయిన హక్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
News October 3, 2025
మహిళా ఖైదీలకు ‘అపూర్వ’ కానుక

క్షణికావేశంలో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు టీచర్‌గా మారారు అపూర్వ వివేక్. ఝార్ఖండ్ రాంచీకి చెందిన ఈమె 2013 నుంచి ఖైదీల సేవకే తన సమయాన్ని కేటాయించారు. న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి, వారి పిల్లలకు చదువు చెబుతున్నారు. అలాగే వారిలో కుంగుబాటును నివారించడానికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.