News February 19, 2025
ఎక్స్ట్రా టికెట్లు ఎందుకు అమ్మారు?: ఢిల్లీ HC ఆగ్రహం

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటీవల తొక్కిసలాట జరిగి 18మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు CJI ధర్మాసనం విచారణ జరిపింది. కోచ్‌లో పట్టే ప్రయాణికుల కంటే రైల్వే అదనపు టికెట్లు ఎందుకు అమ్ముతోందని మండిపడింది. కోచ్‌లో ప్రయాణికుల పరిమితిపై, అనుమతి లేకుండా కోచ్‌ల్లోకి ప్రవేశిస్తున్న వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారని రైల్వేస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Similar News
News January 19, 2026
‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ కన్నుమూత

యానిమేటెడ్ మూవీ ‘ది లయన్ కింగ్’(1994) కో-డైరెక్టర్ రోజర్ అల్లర్స్(76) మరణించారు. శాంటా మోనికాలోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీలో పలు చిత్రాలకు పని చేశారు. అలాద్దీన్(1992), ఓలివర్&కంపెనీ(1988), బ్యూటీ&ది బీస్ట్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు. ఆయన మరణంపై డిస్నీ CEO బాబ్ ఇగర్ విచారం వ్యక్తం చేశారు. వెటరన్ దర్శకుడికి నివాళులు అర్పించారు.
News January 19, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<
News January 19, 2026
అమెనోరియా సమస్యకు కారణమిదే!

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.


