News May 7, 2025

ఉగ్రదాడి సమయంలో అక్కడ సైనికులు ఎందుకు లేరంటే?

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి సమయంలో అక్కడ సైనికులు ఎందుకు లేరు? అని ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏటా బైసరన్ ప్రాంతం అమర్‌నాథ్ యాత్రతో పాటే టూరిస్టుల కోసం ఓపెన్ అవుతుందని చెప్పింది. ఆ సమయంలో సైనికుల పహారా ఉంటుందని తెలిపింది. కానీ, ప్రస్తుతం APR 20 నుంచే టూరిస్ట్ ఆపరేటర్లు పర్యాటకులను తీసుకొచ్చారని పేర్కొంది. ఆ విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా బలగాలకు చెప్పకపోవడమే కారణమని వివరించింది.

Similar News

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.

News November 18, 2025

ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

image

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.

News November 18, 2025

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

image

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?