News December 23, 2024

ఇక్కడ స్థిరపడ్డాక ఏపీకి ఎందుకెళ్తాం?: నాగవంశీ

image

టాలీవుడ్ APకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాను డబ్బు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నానని, తనలా స్థిరపడిన వారు తిరిగి APలో ఏం చేస్తారని ప్రశ్నించారు. షూటింగుల్లో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు కానీ తెల్లవారుజామున గం.4:30కి సినిమా పడితే చాలని మీడియాకు తెలిపారు. FDC ఛైర్మన్ దిల్ రాజుకు తమ విజ్ఞప్తులు అందిస్తామన్నారు.

Similar News

News December 23, 2024

ALERT.. 3 రోజులు వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

News December 23, 2024

షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా

image

దేశంలో ఆశ్ర‌యం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హ‌సీనాను అప్ప‌గించాల‌ని భారత్‌ను బంగ్లా మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వం అధికారికంగా కోరింది. భార‌త్‌తో ఉన్న‌ ఖైదీల మార్పిడి ఒప్పందం మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ కోసం ఆమెను అప్ప‌గించాల్సిందిగా కోరిన‌ట్టు బంగ్లా దేశ విదేశాంగ స‌ల‌హాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హ‌సీనా హ‌యాంలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో జ‌రిగిన హ‌త్య కేసుల్లో ఆమెపై ఇప్ప‌టికే అభియోగాలు మోపారు.

News December 23, 2024

DHOP మూమెంట్.. స్టార్ హీరోలతో తమన్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.