News April 3, 2024

చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి: ధర్మాన

image

AP: ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చంద్రబాబు ఏనాడు చేయలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘ఏనాడైనా ప్రజలకు ఒక ఇల్లు ఇచ్చారా? సెంటు జాగా ఇచ్చారా? మీకెందుకు ఓటెయ్యాలి. ఈ నెల ఒకటో తేదీన పింఛను రాలేదంటే అందుకు కారణం చంద్రబాబే. ఆయనకు రాజకీయాలే ముఖ్యం. పవన్ సినిమాలు చూడండి.. కానీ ఓటు వేయకండి. పవన్, చంద్రబాబుకి ఓటేస్తే వారు HYDలోనే ఉంటారు.. CM జగన్ ఎప్పుడు మీ మధ్యే ఉంటారు’ అని చెప్పారు.

Similar News

News November 1, 2025

85% మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

image

TG: మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో‌ 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.

News November 1, 2025

లవ్ స్టోరీ చెప్పేసిన అల్లు శిరీష్

image

<<18163585>>నిశ్చితార్థం<<>> చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని ఇన్‌స్టాలో వెల్లడించారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్, శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను కలుసుకున్నట్లు తెలిపారు. అలా ప్రేమ మొదలవ్వగా సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతా’’ అంటూ రాసుకొచ్చారు.

News November 1, 2025

గర్భవతిని చేసేవారు కావాలంటూ ₹11 లక్షలకు టోకరా

image

సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘గర్భవతిని చేయగల పురుషుడి కోసం ఎదురుచూస్తున్నాను’ అనే ఆన్‌లైన్ యాడ్ ఇచ్చి పుణేకు చెందిన కాంట్రాక్టర్‌ను ₹11Lకు బురిడీకొట్టించారు. ఆయన కాల్ చేయగా ఓ యువతి తన వీడియో పంపింది. ఆపై సైబర్ ముఠా ఫీజుల పేరిట డబ్బు వసూలు చేసింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించగా మోసమని తేలింది. ప్రెగ్నెంట్ జాబ్, ప్లేబాయ్ పేరిట ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.