News August 23, 2024
కేరళ సీఎస్గా భర్త తర్వాత భార్య

కేరళ అధికార యంత్రాంగంలో ఆసక్తికర ఘటన జరిగింది. అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) పదవి భార్యాభర్తలిద్దరిని వరిస్తోంది. ప్రస్తుత CS వేణు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన భార్య, స్థానిక స్వపరిపాలన శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ CSగా బాధ్యతలు చేపట్టనున్నారు. IAS దంపతులు CSగా నియమితులు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇద్దరూ 1990 IAS బ్యాచ్కు చెందిన వారే.
Similar News
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.
News November 17, 2025
VIRAL: ప్రభాస్ లేటెస్ట్ లుక్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఫొటోలు వైరలవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలు దిగారు. ఎప్పుడూ తలకు క్లాత్ ధరించి కనిపించే ఆయన చాలారోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.


