News March 1, 2025
ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

TG: వరంగల్‌లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్‌లో శామ్యూల్‌తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.
Similar News
News October 24, 2025
నేడు, రేపు భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, NGKL, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారితే.. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు పేర్కొంది.
News October 24, 2025
మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి.. వైద్య సేవలకు ఆదేశం

AP: తెల్లవారుజామున కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి వైద్యసేవలు అందించాల్సిందిగా కర్నూలు GGH సూపరింటెండెంట్‌ను ఆదేశించాను. FSL టీమ్‌లను సంఘటనాస్థలికి పంపించాం’ అని తెలిపారు.
News October 24, 2025
రాష్ట్రంలో 121 పోస్టులు… అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 26) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD/MS, M.Ch, DM ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. Asst ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠంగా 50ఏళ్లు, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. *మరిన్ని <<-se_10012>>ఉద్యోగ<<>> నోటిఫికేషన్ల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.


