News June 18, 2024
క్యాన్సర్‌తో భార్య మృతి.. నిమిషాల్లోనే IPS ఆఫీసర్ ఆత్మహత్య
అస్సాంలో హృదయవిదారక ఘటన జరిగింది. క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ భార్య మృతి చెందడంతో తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే భర్త, IPS ఆఫీసర్ శిలాదిత్య చెటియా ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకున్న ఆయనను ఆస్పత్రికి తరలించేలోపు మరణించారు. శిలాదిత్య అస్సాం ప్రభుత్వంలో హోం&పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పనిచేసేవారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన పలు జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు.
Similar News
News January 6, 2025
HMPV ఎఫెక్ట్: హాస్పిటల్స్ షేర్లకు లాభాలు
దేశంలో <<15078134>>కొత్త వైరస్<<>> కేసులతో మదుపర్లు భయాందోళనలకు గురవడంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల షేర్లు మాత్రం లాభాల్లో పరిగెడుతున్నాయి. అపోలో, రెయిన్‌బో, KIMS, ఆస్టర్, నారాయణ హృదయాలయ తదితర హాస్పిటళ్ల షేర్లు 2-4% లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రులకు తాకిడి పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
News January 6, 2025
మోహన్ బాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనలు కొనసాగాల్సి ఉండగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులోకి రాలేదు. దీంతో మరో న్యాయవాది పాస్ ఓవర్ కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. గురువారానికి వాయిదా వేసింది. కాసేపటికి ముకుల్ రోహత్గీ వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయమూర్తులు అంగీకరించలేదు.
News January 6, 2025
ఆందోళన వద్దు.. మీరోజు కోసం వేచి ఉండండి!
ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్‌నెస్‌ను రుచిచూడండి.