News August 20, 2024
డెంగ్యూతో భార్య మృతి.. కేంద్ర మంత్రికి ఎయిమ్స్‌లో చికిత్స

కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయెల్ ఓరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆయనను భువనేశ్వర్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల కిందట జుయెల్ భార్య జింగియా డెంగ్యూతోనే కన్నుమూశారు. కాగా ఒడిశాలోని సుందర్‌గఢ్ నుంచి బీజేపీ తరఫున ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు.
Similar News
News November 12, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

APలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి వారంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నంబర్ రాకపోతే ఆటోమేటిక్‌గా కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం శాశ్వత నంబర్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.500-1000 ఇస్తేనే నంబర్ ఇస్తామని వాహన డీలర్లు బేరాలాడుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇకపై వీటికి చెక్ పడనుంది.
News November 12, 2025
భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<
News November 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 7

విద్యావాన గుణీ అతిచాతుర| రామ కాజ కరివే కో ఆతుర||
హనుమంతుడు గొప్ప విద్యావంతుడు. సద్గుణాలు కలవాడు. అత్యంత తెలివైనవాడు. ఎల్లప్పుడూ రామ కార్యాన్ని పూర్తి చేయడంలో ఉత్సాహం చూపిస్తాడు. ఆయన జ్ఞానం, నైపుణ్యం, సేవా తత్పరత అపారమైనవి. ఆయనలోని ఈ తత్వాలను మనం కూడా ఆదర్శంగా తీసుకుని, విద్య, గుణాలు, తెలివితేటలతో పాటు, మన జీవిత ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సిద్ధంగా ఉండాలి. <<-se>>#HANUMANCHALISA<<>>


