News February 27, 2025
భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును..

రష్యాలో ఓ వ్యక్తి ప్రేమికుల రోజున తన భార్యకు ఖరీదైన రూ.27 లక్షల పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. దానికి చిన్నచిన్న డ్యామేజ్లు ఉండటంతో తనకు నచ్చలేదని తిరస్కరించింది. విసుగెత్తిన భర్త ఆ కారును డంపింగ్ యార్డులో పడేశారు. అయితే ఈ వెహికల్ దగ్గర చాలామంది ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌గా మారింది. దీంతో రెండు వారాలు గడిచినా అధికారులు ఆ కారును తీసే ప్రయత్నం చేయట్లేదు.
Similar News
News February 27, 2025
ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్‌కు కాల్ చేయండి

TG: ఆర్టీసీ టికెట్‌పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్‌పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.
News February 27, 2025
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్

ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. త్వరలోనే ఆయన జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా పీటర్సన్ 2009 నుంచి 2016 వరకు ఐపీఎల్లో ఆడారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అప్పటి నుంచే జట్టు ఓనర్ గ్రంధి కిరణ్‌కుమార్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
News February 27, 2025
ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.