News July 1, 2024

కలెక్టర్‌గా IPS ఉమేశ్ చంద్ర భార్య

image

నక్సలైట్లు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులను అణచివేసిన దివంగత IPS ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్‌గా నియమితులయ్యారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉమేశ్ చంద్రను 1999లో HYDలోని SRనగర్‌లో నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ అయ్యారు.

Similar News

News December 2, 2025

నితీశ్‌ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు: అశ్విన్

image

రాంచీ వన్డేకు ఆల్‌రౌండర్ నితీశ్‌‌ను సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్దిక్ లేని టైంలో నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్షన్ టీంను ప్రశ్నించారు. జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. హార్దిక్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలరని, అవకాశాలిస్తే మెరుగవుతారన్నారు. ఇలా జరగలేదంటే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

News December 2, 2025

డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

image

1912: సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1996: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం (ఫొటోలో)
* జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

News December 2, 2025

శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

image

‘దిత్వా’ తుఫానుతో నష్టపోయిన శ్రీలంకకు అండగా ఉంటామని PM మోదీ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సాయం అందిస్తామన్నారు. శ్రీలంకలో తుఫాను బీభత్సానికి 300మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారు. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామగ్రిని పంపిన భారత్‌కు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు.