News November 28, 2024

భార్య గొడవపెట్టుకోవడం క్రూరత్వం కాదు.. విడాకులివ్వలేం: హైకోర్టు

image

దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్‌మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.

Similar News

News December 31, 2025

పాక్ కీలక బౌలర్‌కి గాయం.. WCకి డౌట్?

image

T20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు పెద్ద షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది గాయపడ్డారు. మోకాలి గాయంతో BBL నుంచి తప్పుకున్నారు. ఆయన కోలుకొని WCలో ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో 2021-22 మధ్య మోకాలి సర్జరీ కారణంగా అఫ్రీది కొన్ని నెలలపాటు ఆటకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది. T20 WC ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.

News December 31, 2025

ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపం – లక్షణాలు

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News December 31, 2025

అమ్మాయిలూ.. కడుపునొప్పి వస్తోందా?

image

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫెలోపియన్ ట్యూబ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. అండాశయం నుంచి అండాలను గర్భాశయానికి పంపించడంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటిలో అడ్డంకులు ఏర్పడినపుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీన్ని హైడ్రోసాల్పిన్క్స్ అంటారు. మూత్ర విసర్జన సమయంలో మంట, ఋతుస్రావం సమయంలో నొప్పి ఇవన్నీ హైడ్రోసాల్పింక్స్ లక్షణాలు. కొన్నిసార్లు ఇది సంతానలేమికి దారి తీయొచ్చంటున్నారు నిపుణులు.