News March 17, 2025
బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయ్యాక మాత్రం ‘నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు’ అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక తనువు చాలించాడు.
Similar News
News November 20, 2025
చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.
News November 20, 2025
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News November 20, 2025
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో వాద్రాపై PMLA కింద ఫిర్యాదు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు అందజేసింది. కాగా, ఈ ఏడాది జులైలోనే వాద్రా స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు ఈడీ వెల్లడించింది.


