News January 4, 2025
2020 రిపీట్ అవుతుందా?

కొత్త ఏడాది సరికొత్త వైరస్‌తో మనకు స్వాగతం పలికిందని, ఇది కూడా 2020 మాదిరిగా మారుతుందేమో అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని, 2025లోనూ అదే రిపీటైందని చెబుతున్నారు. కరోనా ఎంతో మంది ప్రాణాలను తీయడంతో పాటు ఆర్థికంగా అట్టడుగుకు తోసేసిందని గుర్తుచేసుకుంటున్నారు. HMPV వైరస్ ఇండియాలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News January 29, 2026
ఉపవాసం ఉన్నరోజు పులిహోర ప్రసాదం తినవచ్చా?

సాధారణంగా దేవుడి ప్రసాదం విడవకూడదంటారు. కానీ ఏకాదశి నాడు ధాన్యంతో (పులిహోర, దద్దోజనం వంటివి) చేసిన ప్రసాదాన్ని తినకూడదట. దానిని కళ్లకు అద్దుకుని భద్రపరచాలి అంటున్నారు పండితులు. మరుసటి రోజు, ద్వాదశి నాడు స్వీకరించాలట. ఉపవాస నియమం ప్రకారం.. బియ్యంతో చేసిన ఏ పదార్థమైనా ఆ రోజు తీసుకోకూడదు. పండ్లు, పంచామృతం వంటివి ప్రసాదంగా ఇస్తే తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. అయితే ఈ నియమం ఏకాదశి ఉపవాసానికి మాత్రమే!
News January 29, 2026
ఏకాదశి రోజున ఏం చేయాలంటే..?

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మన మనసును అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును పూజించాలి. లక్ష్మీదేవిని కొలుస్తే సిరి సంపదలు సొంతమవుతాయని నమ్మకం. కుదిరితే జాగారణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి దళాలతో స్వామిని పూజించడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభకరం.
News January 29, 2026
మున్సిపల్ ఎలక్షన్స్.. తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నిన్న మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 902 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 382, BRS 258, BJP 169, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 55 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఉ.10.30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటున్నారు.


