News March 21, 2025
చెన్నైలో రోడ్డుకు రవిచంద్రన్ అశ్విన్ పేరు?

మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును చెన్నైలో ఓ రోడ్డుకు పెట్టే అవకాశం ఉంది. అశ్విన్ స్వగృహం ఉన్న వెస్ట్ మాంబళంలోని రామకృష్ణాపురం ఫస్ట్ స్ట్రీట్కు తన పేరును పెట్టే ప్రతిపాదనను ఆయన సంస్థ ‘క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు సమర్పించింది. కాగా.. ఈ ఏడాది IPLలో CSKకు ఆడనున్న అశ్విన్, సీజన్ ముగిశాక IPL నుంచి రిటైరవ్వొచ్చని సమాచారం.
Similar News
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
News October 15, 2025
ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్కౌంటర్లకు నాయకత్వం వహించారు.