News August 27, 2024
అవకాశమొస్తే ప్రభాస్తో మళ్లీ నటిస్తా: ఈశ్వర్ హీరోయిన్

ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ తనకెంతో ప్రత్యేకమని హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమా అక్టోబర్లో రీరిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని చెప్పారు. ‘సుందరకాండ’ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తానని చెప్పారు. ఈశ్వర్ సినిమా రీరిలీజ్ రోజున మొదటి షో చూస్తానని తెలిపారు.
Similar News
News October 14, 2025
బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?
News October 14, 2025
పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్టర్మ్లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
News October 14, 2025
‘ఇది ఆల్టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్

టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన తన ఫొటో చెత్తగా ఉందంటూ US ప్రెసిడెంట్ ట్రంప్ సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నారు. ‘నా గురించి మంచి కథనం రాశారు. కానీ ఫొటో మాత్రం వరస్ట్ ఆఫ్ ఆల్టైమ్. నా జుట్టు కనిపించకుండా చేశారు. తలపై ఏదో చిన్న కిరీటం ఎగురుతున్నట్టు పెట్టారు. భయంకరంగా ఉంది. కింది నుంచి తీసే ఫొటోలు నాకిష్టం ఉండవు. ఇది సూపర్ బ్యాడ్ పిక్చర్. ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అసహనం వ్యక్తం చేశారు.