News September 18, 2024
‘జమిలి’ కోసం అన్ని ప్రభుత్వాలు రద్దు చేస్తారా?: కేటీఆర్

TG: జమిలి ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు. ‘పార్టీ నేతలతో చర్చించాకే జమిలిపై తమ నిర్ణయం వెల్లడిస్తాం. రాష్ట్రంలో బలహీనవర్గాలను కాంగ్రెస్ దగా చేస్తోంది. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. రూ.25 నుంచి రూ.35 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News November 23, 2025
సంగారెడ్డి: సంపులో మృతదేహం లభ్యం.. గుర్తిస్తే చెప్పండి

సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నూతనంగా నిర్మిస్తున్న సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ రాము నాయుడు ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఎవరైనా గుర్తిస్తే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
News November 23, 2025
AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.
News November 23, 2025
సంజూ మరో‘సారీ’

భారత ప్లేయర్ సంజూ శాంసన్‌కు వన్డేల్లో మరోసారి నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ స్టార్ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. జడేజా చాలా రోజుల తర్వాత వన్డేలకు ఎంపికయ్యారు. ఎన్నో రోజులుగా చోటు కోసం ఎదురుచూస్తున్న రుతురాజ్ సైతం టీమ్‌లోకి వచ్చారు. అయితే వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉన్నా రెండేళ్లుగా సంజూను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మీ కామెంట్?


