News October 31, 2024
హైదరాబాద్‌ను అమరావతి బీట్ చేస్తుందా? KTR రిప్లై ఇదే

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు Xలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు నేతృత్వంలో అమరావతి ఐటీ సిటీగా బలపడి హైదరాబాద్‌ను అధిగమిస్తుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న లీడర్ కానీ HYD స్వంతగానే అభివృద్ధి చెందింది. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును దాటేసింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు’ అని అన్నారు.
Similar News
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
ఏకాదశి: ఎల్లుండి ఉపవాసం ఉంటున్నారా?

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.
News February 11, 2026
SEBI 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


