News October 22, 2025
లిక్కర్ షాపులకు అప్లికేషన్లు.. లక్షకు చేరుతాయా?

TG: రాష్ట్రంలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 89,805 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రంగారెడ్డి(D)లో అత్యధికంగా 27వేలు, ఆదిలాబాద్(D)లో అత్యల్పంగా 3,894 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. రేపటి వరకు అవకాశం ఉండటంతో లక్షకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. 2,620 లిక్కర్ షాపులకుగానూ వచ్చిన అప్లికేషన్లతో దాదాపు రూ.2,700 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
Similar News
News February 9, 2026
ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం

T20WCలో భాగంగా ఇటలీతో జరిగిన <<19091297>>మ్యాచ్‌లో<<>> స్కాట్లాండ్ 73 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 స్కోరుకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52), హ్యారీ మనేంటి(37), జేజే స్మట్స్(22) మినహా అందరూ విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 4, మార్క్ 2, బ్రాడ్ కుర్రీ, వీల్, ఒలీవర్ తలో వికెట్ తీశారు.
News February 9, 2026
సోషల్ మీడియాలో ‘Vagueposting’.. అసలేంటిది?

గతవారం Vagueposting గ్లోబల్ గూగుల్ ట్రెండులోకి రావడంతో దీనిగురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సమయం, సందర్భం, సరైన వివరాలు, అర్థం లేకుండా బాధ, సంతోషం, కోపాన్ని వ్యక్తపరుస్తూ SMలో చేసే పోస్టులనే Vagueposting అంటారు. యూజర్లను గందరగోళంలో పడేసి వారి అటెన్షన్‌ను పొందేందుకు ఇలా చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి పోస్టులు కనిపిస్తే స్కిప్ చేయండి. దీనిగురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.
News February 9, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(బీఈ, బీటెక్), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు ఫిబ్రవరి 10న, డిప్లొమా ట్రైనీలకు ఫిబ్రవరి 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in/


