News April 13, 2024

ఏ రాత్రైనా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం: ఇరాన్

image

ఏ రాత్రైనా తాము దాడి చేయొచ్చని, సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్‌ను ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ‘మేమేం చేస్తామో ఇజ్రాయెల్‌కు తెలీదు. ఎక్కడ దాడి చేస్తామోనని బిక్కుబిక్కుమంటోంది. నిజమైన యుద్ధం కంటే ఈ మానసిక, రాజకీయ యుద్ధమే వారిని ఎక్కువ భయపడుతోంది’ అని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు రహీం తెలిపారు. సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 3, 2026

కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

image

TG: అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీచేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అలాగే కడియంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కూడా నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.

News February 3, 2026

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

image

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

News February 3, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. కొన్ని గంటల క్రితం <<19036596>>తగ్గిన<<>> బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి ₹1,53,930కు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి ₹1,41,100కు చేరింది.