News January 4, 2025
మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?

TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.
Similar News
News December 24, 2025
PHOTOS: పొలంలో సల్మాన్, ధోనీ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మహారాష్ట్రలోని పన్వెల్ ఫామ్‌హౌస్‌లో భారత క్రికెట్ దిగ్గజం ధోనీ, సింగర్ ఏపీ ధిల్లాన్ సందడి చేసిన ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నిన తర్వాత ఒళ్లంతా బురదతో ఉన్న సల్మాన్, ధోనీ కలిసి దిగిన ఫొటో తెగ వైరలవుతోంది. స్టార్స్ హోదాను పక్కనపెట్టి ప్రకృతి ఒడిలో వీరు గడపడంపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
News December 24, 2025
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు RITES నోటిఫికేషన్ విడుదల

RITES 7 అసిస్టెంట్ మేనేజర్(<
News December 24, 2025
ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫయర్లు లగ్జరీ కాదు: HC

ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫయర్లను లగ్జరీ వస్తువులు అనలేమని ఢిల్లీ HC వ్యాఖ్యానించింది. లగ్జరీ కేటగిరీతో 18% GST గల వీటిని మెడికల్ డివైజ్‌లుగా గుర్తించి 5% శ్లాబుకు మార్చాలన్న PIL పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. ‘రోజూ 21K సార్లు గాలి పీలుస్తూ లంగ్స్‌కు ఎంతో హాని చేస్తున్నాం. ప్రజారోగ్యం కోసం కనీసం ఈ నిర్ణయం తీసుకోలేరా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాత్కాలికంగా అయినా పన్ను తగ్గించాలని ఆదేశించింది.


