News December 2, 2024
పదేళ్లు అధికారంలో ఉంటాం: రేవంత్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బోనస్ డబ్బులతో రైతుల కళ్లలో ఆనందం చూసి తనకు బిర్యానీ తిన్నంత ఖుషీగా ఉందన్నారు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. రైతులను మరిచిన కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
Similar News
News March 16, 2026
నాడు ఫ్రీగా యాక్టింగ్.. నేడు ₹5.5 కోట్ల రాయల్టీ!

ఆస్కార్ అవార్డు పొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రం తనను మిలియనీర్‌ను చేసిందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘నిర్మాతలు తన ఫీజును భరించలేమని చెప్పడంతో ఫ్రీగా నటించా. అయితే సినిమా ఘనవిజయం సాధించాక వారు స్వచ్ఛందంగా పంపిన రాయల్టీ ద్వారా ₹5.5 కోట్లకు పైగా అందుకున్నా. ఇటీవలే రూ.3లక్షల చెక్ వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News March 16, 2026
షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.
News March 16, 2026
వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)


