News January 16, 2025
టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉంటా: కెవిన్

టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్ట్ చూపారు. పురుషుల జట్టు కోసం బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు కెవిన్ రిప్లై ఇచ్చారు. నేను అందుబాటులో ఉన్నా అంటూ ఆయన సమాధానమిచ్చారు. కెవిన్ తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 8181 రన్స్, 136 వన్డేల్లో 4440, 37 టీ20ల్లో 1176 రన్స్ చేశారు.
Similar News
News November 18, 2025
ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?