News July 17, 2024
అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న బైడెన్?

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోనున్నారా? సొంత పార్టీ నేతలే డిమాండ్ చేసినా ససేమిరా అన్న ఆయన, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ‘కమలా హారిస్ గొప్ప వైస్ ప్రెసిడెంటే కాదు, మున్ముందు అమెరికా ప్రెసిడెంట్ కూడా కావొచ్చు’ అని అన్నారు. దీంతో బైడెన్ ఇక వైదొలగుతారన్న ప్రచారం మొదలైంది. అయితే, అధికారికంగా ఆయన్నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News March 26, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.
News March 26, 2026
సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
News March 26, 2026
హార్ముజ్ భారత్‌కు తెరిచే ఉంటుంది: ఇరాన్ విదేశాంగ మంత్రి

హార్ముజ్ ఇండియాకు తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని తెలిపింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.


