News April 5, 2024

GST కొత్త విధానాన్ని తీసుకొస్తాం: కాంగ్రెస్

image

అధికారంలోకి వస్తే ప్రస్తుత జీఎస్‌టీ విధానాన్ని రద్దు చేసి GST 2.0ను తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పేదలపై భారం లేకుండా కొత్త జీఎస్‌టీని రూపొందిస్తామని పేర్కొంది. NDA అమలులోకి తీసుకొచ్చిన ఈ జీఎస్‌టీ రూపకల్పనలో అనేక లోపాలు ఉన్నాయని, అవి ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయని కాంగ్రెస్ గతంలో విమర్శించింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Similar News

News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.

News October 8, 2024

ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!

image

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్‌తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.

News October 8, 2024

శతక్కొట్టిన సల్మాన్.. పాక్ భారీ స్కోర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ అఘా సల్మాన్ విధ్వంసం సృష్టించారు. 108 బంతుల్లోనే సల్మాన్ (100*) సెంచరీ బాదారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు అబ్దుల్లా షఫీఖ్ (102), షాన్ మసూద్ (151) కూడా సెంచరీలు చేయడంతో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టారు.