News April 23, 2025
BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
News April 23, 2025
అద్భుతమైన క్యాచ్‌లు కాదు.. క్యాచ్ పడితే అద్భుతం!

IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.