News December 13, 2024

బన్నీకి రిమాండ్ విధిస్తారా?

image

అల్లు అర్జున్ విషయంలో నాంపల్లి ట్రయల్ కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తనపై కేసులు క్వాష్ చేయాలన్న బన్నీ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ సాయంత్రం గం.4కు వాయిదా వేసింది. అయితే ఈలోపే పోలీసులు ఆయన్ను ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దీంతో ఈ న్యాయమూర్తి హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తారా? లేక రిమాండ్ విధిస్తారా? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి.

Similar News

News January 13, 2026

తిరుమల: శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,542 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 22,372 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్లు ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.

News January 13, 2026

తెలంగాణలో ‘కొత్త’ పంచాయితీ!

image

రాష్ట్రంలో జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి CM KCR జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ప్రస్తుత CM రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.

News January 13, 2026

గ‌ర్భిణులు నువ్వులు తిన‌కూడ‌దా?

image

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.