News April 3, 2024
ఏపీలో ప్రచారం చేస్తా: జయప్రద

AP: రాష్ట్రంలో TDP తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని BJP నేత, సినీనటి జయప్రద అన్నారు. ‘నేను UPలో ఉంటున్నా.. ఎప్పటికీ తెలుగు బిడ్డనే. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు ఇష్టం. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని లేవు. వాటి కోసం పోరాడుతాను. ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు’ అని ఆమె చెప్పారు.
Similar News
News January 15, 2026
KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.
News January 15, 2026
మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
News January 15, 2026
రాజ్యాంగానికి రాహుల్, రేవంత్ తూట్లు: KTR

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ <<18864508>>క్లీన్‌చిట్<<>> ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే. రాహుల్, రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. జంప్ జిలానీలకు, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా BRS పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.


