News March 23, 2025
క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.
Similar News
News March 25, 2025
‘గూగుల్’ గురించి ఈ విషయం తెలుసా?

‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం అమలు చేస్తోన్న ఓ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోంది. అలాగే వారి పిల్లల్లో ప్రతి ఒక్కరికీ 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు $1,000 (రూ.84వేలు) అందిస్తోంది. ఉద్యోగి కుటుంబం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కంపెనీ అండగా నిలవడం గ్రేట్ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మీరేమంటారు?
News March 25, 2025
భార్యపై ‘రిప్లింగ్’ కో-ఫౌండర్ సంచలన ఆరోపణలు

అనూప్ అనే వ్యక్తితో తన భార్య దివ్య అక్రమ సంబంధం పెట్టుకుందని రిప్లింగ్ కంపెనీ కో-ఫౌండర్, TNకు చెందిన ప్రసన్న శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారి చాట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. అందులో ఆమె ‘కండోమ్’ గురించి ప్రస్తావించిందని ప్రసన్న తెలిపారు. మరోవైపు భర్త తనను వేధిస్తున్నాడంటూ దివ్య ఫిర్యాదు చేయడంతో ప్రసన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి పదేళ్ల కిందట పెళ్లి కాగా ఓ కొడుకు ఉన్నాడు.
News March 25, 2025
అశుతోశ్ను అలా ఎలా వదిలేశారో!

అశుతోశ్ గత ఏడాది పంజాబ్కు ఫినిషర్గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!