News August 5, 2024

స్పైసీ ఫుడ్ తినడానికి మళ్లీ ఇండియా వస్తా: జాన్ సీనా

image

అంబానీ ఇంట పెళ్లి వేడుకలో వంటకాలు అద్భుతంగా ఉన్నాయని WWE స్టార్ జాన్ సీనా వెల్లడించారు. ఇండియన్ స్పైసీ ఫుడ్ తినడానికి మరోసారి భారత్ రావాలనుకుంటున్నానని చెప్పారు. వేడుకలో కలిసిన షారుఖ్ మాటలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ‘కింగ్‌ఖాన్‌తో TED(టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్) గురించి మాట్లాడా. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఆయనతో చేయి కలపడం ఎమోషనల్ మూమెంట్’ అని పేర్కొన్నారు.

Similar News

News April 4, 2026

ఆరెంజ్ క్యాప్‌తో హిట్‌మ్యాన్

image

IPL: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ సాధించారు. ఢిల్లీపై బ్యాటింగ్ అనంతరం ఇంటర్వ్యూలో ఆ క్యాప్ ధరించారు. హిట్‌మ్యాన్ రెండు మ్యాచుల్లో కలిపి 56.50 సగటుతో 113 రన్స్ చేశారు. రోహిత్ తర్వాత కనోలి (108), రఘువంశీ (103), ఇషాన్ (94) ఉన్నారు.

News April 4, 2026

రాఘవ్ చడ్ఢా రాజ్యసభ సభ్యత్వం పోతుందా?

image

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆప్ ఇప్పుడు ఆయన్ను MPగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎంపీని తొలగించే హక్కు పార్టీకి ఉండదు. పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసినా రాజ్యసభ సభ్యత్వం కొనసాగుతుంది. 6 ఏళ్లు సభ్యుడిగా టర్మ్ పూర్తి చేయొచ్చు. విభేదాలున్నా సరే ఆప్ నుంచి రాఘవ్ చడ్ఢాను ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News April 4, 2026

కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోంది: బొత్స

image

AP: అమరావతిలో కృష్ణా కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోందని YCP నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘అమరావతిపై GOVTది ప్రచారార్భాటమే. అక్కడి అవినీతికి తప్ప YCP దానికి వ్యతిరేకం కాదు. తీర్మానాలతో అమరావతి పర్మినెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. దాన్ని శాసన రాజధానిగానే చూస్తాం. రెండేళ్లైనా నిర్మాణాలు పూర్తిచేయలేదు’ అని మండిపడ్డారు. అనేక సమస్యలుండగా అమరావతినే అభివృద్ధి చేస్తామంటే కుదరదన్నారు.