News May 5, 2024

ఈసీకి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేశ్

image

AP: అనకాపల్లి జిల్లా తారువలో తనపై వైసీపీ నేతలు <<13183356>>దాడికి <<>>పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. ‘డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. అనకాపల్లి ఎంపీ స్థానంలో ముత్యాలనాయుడు, మాడుగులలో ఆయన కుమార్తె ఓడిపోతామనే భయంతోనే ఇలా దాడులకు దిగుతున్నారు’ అని ఆగ్రహించారు.

Similar News

News January 16, 2026

BREAKING: ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అమెజాన్‌కు షాక్

image

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.

News January 16, 2026

OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

image

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్‌లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.

News January 16, 2026

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

image

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్‌ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.