News September 23, 2024
దామచర్ల వ్యాఖ్యలపై పవన్‌కు ఫిర్యాదు చేస్తా: బాలినేని

AP: తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన <<14167036>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ MLA బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైసీపీలో ఇబ్బందుల కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Similar News
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.
News November 7, 2025
తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.


