News June 11, 2024
ఎంపీగా కొనసాగుతా: అఖిలేశ్

తాను ఎంపీగానే కొనసాగుతానని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి పోటీ చేసిన ఆయన 1.70 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. యూపీలో SP 37 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 14, 2025
అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్(60) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. న్యూయార్క్‌లోని ఆయన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారని మేనేజర్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అపార్ట్మెంట్లో ఎలాంటి సస్పెక్ట్ యాక్టివిటీస్ లేవని పోలీసులు తెలిపారు. ఎన్నో విలన్ పాత్రలతో గ్రీన్ ప్రేక్షకులను అలరించారు. పల్ప్ ఫిక్షన్, ది మాస్క్ చిత్రాలు ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి.
News December 14, 2025
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గోయల్

నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రభుత్వ మాజీ ఉద్యోగి రాజ్‌కుమార్ గోయల్ అపాయింట్ అయ్యారు. ప్రధాని మోదీ సారథ్యంలోనే ముగ్గురు సభ్యుల కమిటీ ఈయన పేరును ఎంపిక చేసింది. మరో 8మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లనూ ప్యానెల్ సిఫార్సు చేసింది. రేపు RK గోయల్‌తో CICగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం యూనియన్ టెరిటరీస్ క్యాడర్‌కు చెందిన 1990వ బ్యాచ్ IAS(రిటైర్డ్).
News December 14, 2025
AIIMS మంగళగిరి 76 పోస్టులకు నోటిఫికేషన్

<


