News April 8, 2024
టీడీపీలోనే కొనసాగుతా: మహాసేన రాజేశ్

టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్ వేదికగా మహాసేన రాజేశ్ ప్రకటించారు. ‘అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నామీద నమ్మకముంచిన చంద్రబాబుకి ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు. అందుకు మహాసేన కూడా సిద్ధం’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News March 3, 2025
KKR కొత్త జెర్సీ.. కొత్త సంప్రదాయానికి నాంది

IPL-2025 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గత సీజన్‌తో పోలిస్తే ఇది పూర్తి డిఫరెంట్‌గా ఉంది. అలాగే ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీని గెలిచినందుకు గుర్తుగా జెర్సీపై 3 స్టార్లను పెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో జెర్సీ షోల్డర్లకు గోల్డ్ బ్యాడ్జ్‌లు ఉండనున్నాయి. లీగ్ చరిత్రలో ఈ బ్యాడ్జ్ ధరించిన తొలి టీమ్‌గా KKR నిలిచింది. ఇకపై ఏటా ఈ సంప్రదాయం కొనసాగనుంది.
News March 3, 2025
వివి వినాయక్ హెల్త్ రూమర్స్‌కు చెక్

ప్రముఖ దర్శకుడు VV వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. ఆయన గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని అభిమానులను కోరింది. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా గతేడాది ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేసిన ఆయన ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు.
News March 3, 2025
CM రేవంత్‌కు హరీశ్ సవాల్

TG: బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని ఆరోపించిన సీఎం రేవంత్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని, లేదంటే ఆయన రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని విషయాలను ఎండగడతామన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టన్నెల్ పనులకు BRS ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, విద్యుత్తు బకాయిలు చెల్లించలేదని సీఎం విమర్శించిన విషయం తెలిసిందే.