News July 30, 2024

అలా జరిగితేనే ధోనీ IPL ఆడుతాడు?

image

ఒక్కో ఫ్రాంచైజీ ఐదుగురు లేదా ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటేనే ధోనీ IPL 2025 ఆడుతారని తెలుస్తోంది. ఒకవేళ నలుగురికే అవకాశం ఉంటే గైక్వాడ్, దూబే, జడేజా, పతిరణను CSK అట్టిపెట్టుకోనున్నట్లు టాక్. ఐదుగురిని అనుమతిస్తే ధోనీని కూడా రిటైన్ చేసుకోనుందట. రేపు జరిగే BCCI-IPL మీటింగ్‌లో దీనిపై క్లారిటీ రానుంది. కాగా ఆడితే CSK తరఫునే ఆడాలని, లేదంటే IPLకు గుడ్ బై చెప్పాలని మహీ యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 16, 2025

లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.

News November 16, 2025

పెరుగుతో అందం పెంచేయండి..

image

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.

News November 16, 2025

అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

image

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.