News August 4, 2024

జకోవిచ్ రివేంజ్ తీర్చుకుంటాడా?

image

వింబుల్డన్ ప్రత్యర్థులు జకోవిచ్, అల్కరాజ్ మరోసారి తలపడనున్నారు. ఒలింపిక్స్ టెన్నిస్ ఫైనల్ చేరిన ఈ ప్లేయర్లు తొలి స్వర్ణం ఖాతాలో వేసుకునేందుకు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇటీవల జరిగిన వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్‌ చేతిలో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని జకో చూస్తున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో చైనా ప్లేయర్ క్విన్ వెన్ బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ విభాగంలో చైనా ప్లేయర్ స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి.

Similar News

News March 14, 2026

అభిమానుల కోసం CSK కీలక ప్రకటన

image

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న ROAR-26 పేరుతో మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు CSK ప్రకటించింది. ఇలా చేయడం ఇదే తొలిసారని పేర్కొంది. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, మాథ్యూ హెడెన్, విజయ్, బద్రీనాథ్‌ తదితరులతో కూడిన OG సూపర్ కింగ్స్ ప్రస్తుత టీమ్‌తో తలపడనున్నట్లు తెలిపింది. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్పెషల్ లైవ్ ప్రదర్శన ఇస్తారని వెల్లడించింది.

News March 14, 2026

BREAKING: కమర్షియల్ సిలిండర్ల డెలివరీ ప్రారంభం

image

దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరించినట్లు కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే LPG ఉత్పత్తిని పెంచామని, నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. కాగా ఏయే రాష్ట్రాల్లో పంపిణీ ఉంటుందో వెల్లడించలేదు.

News March 14, 2026

1.71 కోట్ల ORS ప్యాకెట్లు సిద్ధం: సత్యకుమార్

image

AP: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘అవేర్ ప్లాట్‌ఫాం ద్వారా 4-5 రోజుల ముందుగానే ఉష్ణోగ్రతల అప్డేట్ ఇస్తాం. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 1.71Cr ORS ప్యాకెట్లను ఆస్పత్రులకు పంపాం. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.