News June 18, 2024
సూపర్-8లో ఏదైనా ప్రత్యేకంగా చేస్తాం: రోహిత్ శర్మ

T20 WCలో సూపర్-8 దశలో ఏదైనా ప్రత్యేకంగా చేస్తామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘జట్టులో సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సూపర్-8 షెడ్యూల్ కొంచెం టైట్ ఉన్నా ఈస్థాయిలో అలా ఆడేందుకు అలవాటుపడి ఉన్నాం. మా నైపుణ్యాలకు మరింత పదును పెట్టడంపై దృష్టి సారించాం. ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నాం’ అని వెల్లడించారు. భారత్ ఈ నెల 20 అఫ్గాన్‌తో, 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Similar News
News December 9, 2025
‘స్టార్‌లింక్’ ధరలు ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవల ధరలు ఇప్పటివరకు ప్రకటించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్లో నెలకు రూ.8,600 ఛార్జీలు, హార్డ్‌వేర్ కిట్ రూ.34,000గా <<18504876>>చూపడాన్ని<<>> ‘కాన్ఫిగరేషన్ గ్లిచ్’గా కంపెనీ పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని, అసలు ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చారు.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్‌లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


