News May 29, 2024
సగానికిపైగా ఆస్తిని విరాళంగా ఇస్తా: ఆల్ట్‌మన్
తమ సంపదలో 50శాతానికిపైగా విరాళం ఇస్తామని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆయన పార్ట్‌నర్ ఓలివర్ ‘గివింగ్ ప్లెడ్జ్’ ద్వారా ప్రమాణం చేశారు. సమాజానికి తమ వంతు సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. టెక్నాలజీతోనూ సమాజ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామని తెలిపారు. మెలిందా గేట్స్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ‘గివింగ్ ప్లెడ్జ్’ ద్వారా ఎందరో సంపన్నులు విరాళాలను ప్రకటించారు.
Similar News
News January 19, 2025
బుల్లిరాజు పాత్రకు మహేశ్‌బాబు ఫిదా!
ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్‌ను టీమ్‌తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.
News January 19, 2025
డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి
AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
News January 19, 2025
రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేయాలి: హరీశ్ రావు
TG: ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన BRS విజయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం పేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ఉపాధి హామీ స్కీమ్‌కు లింక్ చేయొద్దన్నారు.