News March 25, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలయ్యేది అప్పుడేనా?

image

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మే నెలలో విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల దృష్ట్యా జూన్‌లో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించినట్లు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి జరగనుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Similar News

News April 10, 2026

ఆర్టెమిస్-2: ఇవాళే భూమిపైకి వ్యోమగాములు

image

చంద్రుని యాత్రలో ఉన్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సగం దూరాన్ని దాటేశారు. ప్రస్తుతం గంటకు 3,000 మైళ్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్న ఓరియన్ నౌక.. ఇవాళ భూమికి చేరుకోనుంది. పసిఫిక్ మహాసముద్రంలోని శాన్ డియాగో తీరంలో రాత్రి 8:07 గంటలకు ల్యాండ్ కానుంది. చంద్రుని కక్ష్యలోకి వెళ్లిన వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

News April 10, 2026

IPL: చరిత్ర సృష్టించారు

image

KKRతో మ్యాచ్‌లో LSG ప్లేయర్లు ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సక్సెస్‌ఫుల్ <<19611855>>రన్ ఛేజ్‌లో<<>> 8th వికెట్ లేదా అంతకంటే దిగువన అత్యధిక భాగస్వామ్యం(54*) నమోదు చేసిన జోడీగా నిలిచారు. ఇందులో ముకుల్ ఒక్కరే 52 రన్స్ చేశారు. అలాగే లక్ష్య ఛేదనలో ఏడో నంబర్‌/దిగువన బ్యాటింగ్‌కు వచ్చి హయ్యెస్ట్ సిక్సర్లు(7) బాదిన ప్లేయర్‌గా బ్రావో సరసన ముకుల్ చేరారు.

News April 10, 2026

RBI కొత్త ప్రతిపాదన.. రూ.10,000+ పంపిస్తే!

image

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ₹10వేలకు మించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రిసీవర్ ఖాతాలో ఆ నగదు జమ అయ్యేందుకు ఒక గంట సమయం పట్టేలా రూల్ తేనుంది. ఈలోగా మనీ పంపినవారు వద్దనుకుంటే ఆ బదిలీని రద్దు చేయవచ్చు. బ్యాంకులూ అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్ చేస్తాయి. మర్చంట్, రికరింగ్, చెక్ పేమెంట్స్‌కు ఇది వర్తించదు. దీనిపై మే8 వరకు RBI అభిప్రాయాలు స్వీకరించనుంది.