News October 6, 2025

ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా: జగన్

image

AP: ఉద్యోగులకిచ్చిన హామీల అమలుపై YCP చీఫ్ జగన్ CM చంద్రబాబును ప్రశ్నించారు. ‘ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి నడిరోడ్డుపై నిలబెడతారా? IR, PRC, OPS ఏమయ్యాయి? న్యాయంగా పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. 4 డీఏలు పెండింగ్‌‌లో పెట్టారు. EHS డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 6, 2025

ఆ సిరప్‌పై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

image

AP: కేంద్ర ఆరోగ్యశాఖలోని DGHS సూచన ప్రకారం 2ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబుకు ద్రవరూప మందులను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. MP, రాజస్థాన్‌‌లో పిల్లల మరణానికి దారితీసిన కల్తీ దగ్గు మందు రాష్ట్రానికి సరఫరా కాలేదన్నారు. మెడికల్ షాపులు, ప్రభుత్వాసుపత్రులకు ఆ మందు రానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

News October 6, 2025

ఎకరం రూ.177 కోట్లు.. రికార్డు ధర

image

TG: TGIIC నిర్వహించిన భూ వేలంలో రికార్డు ధర నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను మొత్తం రూ.1,357.57 కోట్లు చెల్లించింది. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే.

News October 6, 2025

16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: CBN

image

AP: పౌరసేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని CM CBN స్పష్టం చేశారు. ‘IVRS, QR కోడ్ ద్వారా వెల్లడవుతున్న ప్రజాభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది? అసంతృప్తి ఎక్కడెక్కడ ఉంది? అన్న సమాచారాన్ని క్రోడీకరించాలి. అప్పుడే సమస్య మూలాల్ని కనుగొని పరిష్కరించగలుగుతాం’ అని పేర్కొన్నారు. ఈనెల 16న శ్రీశైలం వస్తున్నPM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.