News October 26, 2024
మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తా: ధోనీ

MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్‌గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్‌పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Similar News
News November 25, 2025
ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
అరుణాచల్ మా భూభాగం: చైనా

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.
News November 25, 2025
‘నేను మీ పాలకుడిని’ అని చెప్పుకున్న టెర్రరిస్టు ఉమర్ నబీ!

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. టెర్రరిస్టు బుర్హాన్ వాని మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని అతడు భావించాడని నిందితులు చెప్పినట్లు సమాచారం. ‘నేను ఎమీర్‌ను. మీ పాలకుడిని, నాయకుడిని’ అని మిగతా టెర్రరిస్టులకు చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. తానో యువరాజు అన్నట్లు చెప్పుకున్నాడని తెలిపాయి. వారి ప్లాన్‌కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరు పెట్టుకున్నట్లు చెప్పాయి.


