News April 6, 2024

మట్టిలో కలిసేవరకు KCR వెంటే ఉంటా: మాజీ మంత్రి

image

TG: KCR కష్టకాలంలో ఉంటే కొందరు స్వార్థం కోసం పార్టీలు మారడం సరికాదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ‘నేను ఎన్నికల్లో ఓడినా.. కేసీఆర్ నన్ను ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు లేకుండా యాత్ర చేశా. కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నా. అలాంటి నేను.. మట్టిలో కలిసేవరకు ఆయన వెన్నంటే ఉంటా’ అంటూ కార్యకర్తల సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.