News April 10, 2024

ఆయనతో నటించేందుకు ఏదైనా వదులుకుంటా: ప్రియమణి

image

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో నటించేందుకు ఏదైనా వదులుకోవడానికి తాను సిద్ధమని నటి ప్రియమణి అన్నారు. తాను నటించిన ‘మైదాన్’ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ‘ఒకవేళ షారుఖ్ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే ఏదైనా వదులుకొని ఆయన దగ్గరికి వెళతా. ఈ విషయాన్ని మీడియానే ఆయన దగ్గరికి తీసుకెళ్లాలి’ అని కోరారు. కాగా.. 2023లో ఆమె ‘జవాన్’లో షారుఖ్‌తో కలిసి నటించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోనూ ఓ సాంగ్‌లో ఆయనతో స్టెప్పులేశారు.

Similar News

News April 1, 2026

భారీగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,850 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.15వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది.

News April 1, 2026

రెండుమూడు వారాల్లో యుద్ధం ఆపేస్తాం: ట్రంప్

image

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తున్న US వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రానున్న 2-3 వారాల్లో సైనిక చర్య ఆపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ను ముగించడానికి టెహ్రాన్‌తో దౌత్య ఒప్పందం అక్కర్లేదన్నారు. ఈలోగా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకొనే సామర్థ్యాన్ని ఆ దేశం కోల్పోతుందని చెప్పారు. ఇక ఇరాన్‌‌పై అప్డేట్ ఇవ్వడానికి ట్రంప్ బుధవారం 9pm(US కాలమానం)కు ప్రసంగిస్తారని వైట్‌హౌస్ తెలిపింది.

News April 1, 2026

కూపర్.. బ్యాటింగ్ సూపర్

image

PBKS బ్యాటర్ కూపర్ కన్నోలి నిన్న GTపై ఆడిన IPL అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టారు. మిగతా బ్యాటర్లు ఔట్ అవుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా చెలరేగారు. 44 బంతుల్లోనే 5ఫోర్లు, 5సిక్సులతో 72* రన్స్ చేసి జట్టును గెలిపించారు. దీంతో డెబ్యూ మ్యాచులో POTM అవార్డు అందుకున్న ప్లేయర్ల లిస్టులో చేరారు. కూపర్ కంటే ముందు ఈ జాబితాలో 18మంది ఉన్నారు. ఇక PBKS 2011 నుంచి లీగ్‌లో ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో గెలుస్తూ వస్తోంది.