News November 15, 2024

జర్నలిస్టుపై కోర్టుకు వెళ్తా: ఇమానే ఖెలీఫ్

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ పుట్టుకతో పురుషుడేనని తేలినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై ఇటలీ PM మెలోనీ సైతం ఖెలీఫ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై బాక్సర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఆ జర్నలిస్టుపై నేను కోర్టుకు వెళ్లనున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 15, 2024

జగన్ ఒక్క ఛాన్స్ అని నాశనం చేశారు: సీఎం

image

AP: జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.

News November 15, 2024

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

image

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.

News November 15, 2024

ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి

image

TG: సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు ₹500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, KTR రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.