News February 4, 2025

అవసరమైతే జైలుకైనా పోతా: ఎమ్మెల్యే దానం

image

TG: పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకోబోమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. కూల్చివేతల విషయమై తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. తన ఇంట్లో అభిమానించే వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.

Similar News

News December 5, 2025

డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

image

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం

News December 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 5, 2025

పుతిన్‌కు భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేసిన మోదీ

image

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆపై ఢిల్లీ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న PM అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్‌లో పాల్గొన్నారు.