News October 5, 2025

బంగారం ధరలు.. ఈ వారమూ పెరుగుతాయా?

image

మార్కెట్లకు సెలవు కావడంతో ఇవాళ బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400గా ఉంది. అయితే గత వారం దీనిపై రూ.3,920 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గత వారం రోజుల్లో రూ.3,600 పెరిగి రూ.1,09,450కు చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.6వేలు పెరిగి ప్రస్తుతం రూ. 1,65,000గా ఉంది. ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయో చూడాలి.

Similar News

News October 5, 2025

తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి: CBN

image

AP: శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయంలో వసతుల కల్పనపై Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రముఖ ఆలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలం అభివృద్ధి చేద్దామని సీఎంకు వారు సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధికి భూమిని కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

News October 5, 2025

బిహార్ రాష్ట్రంలా మారిన ఏపీ: వైసీపీ

image

AP: కూటమి పాలనలో ఏపీ ఇప్పుడు బిహార్‌లా తయారైందని వైసీపీ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించింది. ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తి పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. వారికి వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవని పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడులకు ఏపీ సురక్షితం కాదని NRIలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసుకొచ్చింది.

News October 5, 2025

రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?

image

ఖైరతాబాద్ MLA పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని సమాచారం. 2023లో BRS నుంచి MLAగా గెలిచి 24లో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ MPగా పోటీ చేశారని స్పీకర్‌కు BRS ఆధారాలు ఇచ్చింది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థులపై PCC షార్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. దీంతో టికెట్ కన్ఫర్మ్‌కు ముందే రిజైన్ చేస్తే హైకమాండ్ పాజిటివ్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై Way2News ప్రశ్నకు దానం సమాధానం దాటవేశారు.